పిసిసి పదవికి గుజరాత్ దెబ్బ
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపికవై గుజరాత్ ఎన్నికల ఫలితాల దెబ్బ పడింది. సోమవారం నాడు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే పిసిసి అధ్యక్షుడి నియామకం జరుగుతుందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
పిసిసి అధ్యక్షుడి నియామకానికి మరో వారం రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పారు. తాము గడువుకు కట్టుబడి ఉన్నామని, త్వరలో నియామకం జరుపుతామని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి పేర్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications