ఎన్టీఆర్ వారసత్వంపై మరోసారి పురంధరీశ్వరి
గుంటూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరి ఎన్టీఆర్ వారసత్వాన్ని మరోసారి లేవనెత్తారు. ఎన్టీఆర్ వారసుడెవరనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సోమవారంనాడు సూచించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని స్వీకరిస్తే తెలుగుదేశం పార్టీ ఆయన పథకాలను ఎందుకు అమలు చేయలేదని ఆమె అడిగారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ వారసుడిగా అభివర్ణించి ఆమె ఇటీవల కలకలం రేపారు. పురంధరీశ్వరి ప్రకటనపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications