మనీషా కిడ్నాపర్ల కాల్చివేత
వరంగల్: వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఎం మనీష (11) కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు కాల్చి చంపారు. నిందితులను తాము అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ముగ్గురు పారిపోడానికి ప్రయత్నించగా కాల్చి చంపినట్టు వరంగల్ పోలీసులు మంగళవారం ఉదయం ప్రకటించారు. మరణించిన నిందితుల పేర్లు: తోకల రాజు, లాదెల్ల అశోక్, బండి నరేష్.
ఈనెల 10న పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మనీషా కిడ్నాప్ కు గురైంది. ఆమె తండ్రి సదానందం వద్ద నమ్మిన బంట్లుగా ఉంటూ వచ్చిన తోకల రాజు, లాదెల్ల అశోక్, బండి నరేష్, పత్తి రాంబాబు, పు లికాసి గుండమ్మ, జిట్టబోయిన కుమారస్వామి డబ్బుల కోసం పథకం ప్రకారం మనీషాను కిడ్నాప్ చేసి, ఆ పాపను కిరాతకంగా హత్య చేశారు. నిందితులందరికీ హత్య, కిడ్నాప్ తదితర నేరాలతో సంబంధాలున్నాయని ఎస్పీ సౌమ్యా మిశ్రా చెప్పారు.












Click it and Unblock the Notifications