కర్నూలులో DRDO విశ్వరూపం.. గాల్లోనూ, నేలపైనా వేటాడే ఏకైక వెపన్!

భారత రక్షణ రంగ ముఖచిత్రాన్ని మార్చేసే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ.. భారత సైన్యానికి కొండంత అండగా నిలిచే సరికొత్త అస్త్రం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 'అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్' (ULPGM-V3) తుది ప్రయోగాలు అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో ఉన్న డీఆర్‌డీఓ (DRDO) టెస్టింగ్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ఈ పరీక్షలు వంద శాతం విజయవంతం కావడంతో భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించింది.

గాల్లోంచి గాల్లోకి.. నేలపైకి.. గురితప్పని 'రుద్రరూపం'!

ఈ సరికొత్త క్షిపణి శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేయనుంది. దీన్ని రెండు రకాలుగా వాడేలా (డ్యూయల్ మోడ్) అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు.

  • ఎయిర్-టు-సర్ఫేస్ (గగనతలం-నేల): గాల్లో ప్రయాణిస్తూనే.. నేలపై శత్రువుల యుద్ధ ట్యాంకులు, బంకర్లను క్షణాల్లో బూడిద చేయగలదు.
  • యిర్-టు-ఎయిర్ (గగనతలం-గగనతలం): గాల్లో దూసుకొచ్చే శత్రు దేశాల డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను వేటాడి మరీ కూల్చేయగలదు.
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

అత్యాధునిక టెక్నాలజీతో..

ఈ క్షిపణిని కమాండ్ చేయడానికి అత్యంత ఆధునికమైన 'ఇంటిగ్రేటెడ్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్' (GCS) ఉపయోగించారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తూ, క్షణాల వ్యవధిలోనే క్షిపణి ప్రయోగాన్ని అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించిన అద్భుతమైన వీడియోను మే 19, 2026న డీఆర్‌డీఓ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది.

DRDO

మన హైదరాబాద్ 'ఆర్‌సీఐ' మార్క్!

ఈ బ్రహ్మాస్త్రం వెనుక మన హైదరాబాద్‌ మేధస్సు దాగుంది. హైదరాబాద్‌లోని 'రీసెర్చ్ సెంటర్ ఇమారత్' (RCI) ఈ ప్రాజెక్ట్‌కు నోడల్ ల్యాబ్‌గా వ్యవహరించగా.. హైదరాబాద్‌కే చెందిన DRDL, చండీగఢ్‌లోని TBRL, పుణెలోని HEMRL ల్యాబ్‌లు ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించాయి.

ఇక ఉత్పత్తి విషయానికొస్తే.. హైదరాబాద్‌కు చెందిన 'భారత్ డైనమిక్స్ లిమిటెడ్' (BDL), 'అదానీ డిఫెన్స్ సిస్టమ్స్'తో పాటు 'న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్' సంస్థలు చేతులు కలిపాయి. మన దేశీ డ్రోన్లతో ఈ క్షిపణిని అనుసంధానించి చేసిన ప్రయోగం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.

Video: గగనతలంలో ఘోర ప్రమాదం, గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
Video: గగనతలంలో ఘోర ప్రమాదం, గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

'మేక్ ఇన్ ఇండియా' గర్వపడేలా..

ఈ క్షిపణి తయారీలో వాడిన ప్రతి అణువూ భారతీయుడే కావడం విశేషం. వందలాది భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) భాగస్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంది. దీని సక్సెస్‌తో తక్షణమే భారీ స్థాయిలో (మాస్ ప్రొడక్షన్) క్షిపణుల తయారీని ప్రారంభించడానికి భారత్ సన్నద్ధమైంది.

రక్షణ శాఖ ప్రశంసల జల్లు..

ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను, భాగస్వామ్య పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇది రక్షణ రంగంలో భారతదేశం సాధించిన "వ్యూహాత్మక మైలురాయి" అని, 'ఆత్మనిర్భర భారత్' కల సాకారమైందని ఆయన కొనియాడారు. డీఆర్‌డీఓ ఛైర్మన్ సమీర్ వి. కామత్ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అన్ని బృందాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి రక్షణ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని ఈ ప్రయోగం నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+