మరో జనసేన నేత కీచక పర్వం.. తల్లితో పాటు మైనర్ కూతురిపై కూడా ??
ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ బంధాలకే మచ్చ తెచ్చేలా, ఓ కన్నతల్లి తన అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సొంత కూతురినే బలవంతంగా ఉండమని ఒత్తిడి తెచ్చిందంటూ ఓ బాలిక చేసిన ఆరోపణలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా సదరు వ్యక్తి తాను "జనసేన నాయకుడిని అని.. తనను ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ బెదిరించాడని బాలిక వాపోయింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ కూడా చర్చకు దారి తీస్తోంది.
అసలేం జరిగిందంటే..
తన తల్లి మోకా లక్ష్మీకి.. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, జనసేన నేత తిరుమాని వెంకటరాజుతో అక్రమ సంబంధం ఉందని బాధిత బాలిక ఆరోపిస్తోంది. ఈ సంబంధం కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని, పరిస్థితిని తట్టుకోలేక తన తండ్రి ఐదు నెలల క్రితమే ఇంటిని వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. గత నెల రోజులుగా తన తల్లి, వెంకటరాజు కలిసి ఇంట్లో మద్యం సేవిస్తూ ఉండేవారని తెలిపింది.

ఈ క్రమంలోనే తనను కూడా బలవంతంగా మద్యం తాగించాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించింది. తల్లి సమక్షంలోనే వెంకటరాజు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం చేశాడని బాలిక కన్నీటి పర్యంతమై చెప్పింది. ఈ దారుణాలను తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని వెల్లడించింది. దీంతో ఇంట్లో జరుగుతున్న ఘటనలతో తీవ్రంగా కలత చెందిన బాలిక, జీవితం మీద విరక్తి చెంది గోదావరి నదిలో దూకి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపింది.
అయితే స్థానికులు గమనించి వెంటనే ఆమెను రక్షించడంతో ప్రాణాపాయం తప్పిందని సమాచారం. ఈ సంఘటన తర్వాతే బాలిక ధైర్యం చేసి బయటకు వచ్చి మొత్తం విషయాన్ని వెల్లడించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కానీ బాధితురాలు నరసాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించింది. తన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని, పలుమార్లు వెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపింది.
వాడు రేప్ చేస్తే చేయించుకో.
— UttarandhraNow (@UttarandhraNow) May 19, 2026
మైనర్ బాలిక కు తల్లి సలహా.
ఆత్మ హత్య కు ప్రయత్నించిన బాలిక.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఘటన.#Narasapuram #UANow pic.twitter.com/HFC7DleaED
ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత కూతురి జీవితాన్నే నాశనం చేసేలా ప్రవర్తించిన తల్లిపై, బాలిక ఆరోపిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించాలని, వెంటనే వైద్య, మానసిక సహాయం అందించాలని కోరుతున్నారు. తన జీవితాన్ని చీకటిలోకి నెట్టేసిన తల్లి, వెంకటరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications