పుట్టపర్తి: కొత్త సంవత్సరంలో దేశంలో అనేక మార్పులు జరుగుతాయని భగవాన్ పుట్టపర్తి సత్యసాయి బాబా వెల్లడించారు. మంగళవారం ప్రశాంతి నిలయంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రబోధాలు చేశారు.
న్యాయస్ధానాల్లో సత్యం కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ పార్టీల్లో కూడా మార్పులు వచ్చే అవకాశముందని బాబా సెలవిచ్చారు. తాను ఎవ్వరికీ కీడు, నష్టం చేయలేదని ఆయన చెప్పారు.