తెలంగాణ డిమాండ్ న్యాయమే: గోగోయ్
కరీంనగర్/ ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ న్యాయమైందేనని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం కూడా న్యాయమైందేనని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. గోగోయ్ గురువారంనాడు తెలంగాణలోని కొన్ని ప్రాజెక్టులను సందర్శించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞాన్ని ఆయన కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టలు పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించడం సామాన్యమైన విషయమేమీ కాదని ఆయన అన్నారు. ఆయన ఎల్లంపల్లి, శ్రీపాద ప్రాజెక్టులను సందర్శించారు. అంతకు ముందు ఆయనకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హైదరాబాదులో అల్పాహార విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications