మొయిలీ హామీ: మధుయాష్కీ
న్యూఢిల్లీ: తెలంగాణ నాయకులు ఆందోళన చెందవద్దని తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పినట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. మధు యాష్కీ గురువారంనాడు వీరప్పమొయిలీని కలుసుకున్నారు. తాను మొయిలీకి వాస్తవ పరిస్థితులు వివరించినట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే పరిస్థితిలోనే తమ పార్టీ అధిష్ఠానవర్గం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో తమకు పార్టీ అధిష్ఠానవర్గంపై నమ్మకం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications