ఇద్దరు మావోయిస్టుల హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లా వరరామచంద్రాపురం మండలం బూరుగువాడలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతులను ఛత్తీస్ ఘడ్ కు చెందిన కోసా, భగత్ లుగా గుర్తించారు. పోలీసులు గాలింపు జరుపుతున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని ఖమ్మం పోలీసు సూపరింటిండెంట్ చౌహాన్ చెప్పారు.
లొంగిపోవాల్సిందిగా పోలీసులు నక్సల్స్ కు సూచించారని, అయితే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, దీంట్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని ఆయన వివరించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక రైఫిల్ ను, తపంచాను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications