నీలోఫర్ వైద్యుల మధ్య గొడవ
హైదరాబాద్: హైదరాబాదులోని నీలోఫర్ పిల్లల వైద్యశాలలో వైద్యుల మధ్య వివాదం చెలరేగింది. డిఎంఓ రవికుమార్ తనను కొట్టాడని ఆర్ ఎంఓ సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు కూడా ఆయన ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పరీశీలన జరుపుతున్నామని ఆస్పత్రి చీఫ్ ఆర్ ఎంఓ ఉషారాణి చెప్పారు.
రవికుమార్ గురువారం రాత్రి విధుల్లో కనిపించకపోవడంతో తాను ప్రశ్నించానని, దీంతో తాగి ఉన్న రవికుమార్ తనను కొట్టాడని సాయికృష్ణ ఫిర్యాదు చేశారు. రవికుమార్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఈ గొడవ వల్ల ఆస్ప్తత్రిలో వైద్య సేవలకు ఏ విధమైన అంతరాయం కలగలేదు.












Click it and Unblock the Notifications