డిఐజిని కాల్చి చంపిన కానిస్టేబుల్
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్ట సీఅర్ పిఎఫ్ కార్యాలయంలో అదనపు డీఐజి గా పనిచేస్తున్న సిరాజుద్దీన్ అలీఖాన్ పై, అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్ హన్మంతరావు కాల్చి చంపాడు. రెండు, మూడు సార్లు తుపాకీ పేలిన శబ్దాలు విన్పించాయని శిబిరంలోని ఇతర కానిస్టేబుళ్ళు చెప్పారు.
హైదరాబాద్ చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన సిరాజుద్దీన్ అలీఖాన్ (56) సీఆర్ పిఎఫ్ లో అదనపు డీఐజిగా పనిచేస్తున్నారు. అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన హనుమంతరావు సంక్రాంతికి సొంత ఊరు వెళ్ళాలనుకుని సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బాస్ ఖాన్ అందుకు నిరాకరించడంతో అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన హనుమంతరావులో హింసా ప్రవృత్తి తలెత్తింది.
గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమంతరావు ఖాన్ పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించే లోపే ఆ పోలీసు ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications