కెసిఆర్ గురించి రోజాకు తెలుసు: మారెప్ప
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురించి సినీనటి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు సంపూర్ణంగా తెలుసునని రాష్ట్ర మంత్రి మారెప్ప అన్నారు. తనకు మతి లేదో, కెసిఆర్ కు మతి లేదో రోజానడిగితే చెప్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తన యాసభాషలతో న్యూసెన్స్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మారెప్ప భాషయాస అందంగా ఉంటాయని, కెసిఆర్ యాసభాషలు ఘోషగా ఉంటాయని ఆయన అన్నారు. కెసిఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రాదని ఆయన అన్నారు. కెసిఆర్ ది రాత్రి బార్, పగలు దర్బార్ అని ఆయన వ్యాఖ్యానించారు.
పాస్ పోర్టుల కేసుల నిందితుడైన కెసిఆర్ కు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తెలంగాణను దోచుకుంటున్న కెసిఆర్ కు తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. కెసిఆర్ కులం వెలమ ఐదు శాతం కూడా లేదని ఆయన అన్నారు. తాను పరుగుపందెంలో ఫస్టు అని, పరుగు పందెంలో కెసిఆర్ తనతో రావాలని ఆయన అన్నారు. తనకు షుగర్ గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ లేదని, తాను ఎంత దూరమైనా పరుగెత్తగలనని, తనతో కెసిఆర్ పరుగెత్తాలని ఆయన అన్నారు. కనీసం తనతో బ్యాడ్మింటన్ ఆడాలని ఆయన అన్నారు. కెసిఆర్ ది లూజ్ టంగ్ అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications