తెలంగాణకు ఢిల్లీలో ఏర్పాట్లు: పాల్వాయి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మరెంతో దూరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె. ఆంటోనీలతో ఆయన శుక్రవారంనాడు చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ఇక ప్రణబ్ ముఖర్జీ కమిటీతో కూడా అవసరం లేదని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులు పార్టీ అధిష్ఠానవర్గానికి తెలిశాయని, వారు వాస్తవాలను అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ అధిష్ఠానవర్గం ఆరా తీసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications