అది వైయస్ బాధ్యతే: ఉప్పునూతల
హైదరాబాద్: తమ నేతగా తెలంగాణ అంశాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిదేనని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. నల్లగొండలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ తెలంగాణ సెంటిమెంటు ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నల్లగొండ జనసముద్రమైందని ఆయన అన్నారు. డబ్బులు పెట్టి తీసుకొచ్చిన మనుషులని కొట్టిపారేయడానికి వీలు లేదని ఆయన అన్నారు.
తెలంగాణ సెంటిమెంటు గురించి తాము చెబుతూనే ఉన్నామని, తమ మాటలను పార్టీ అధిష్ఠానవర్గం ఎందుకు పట్టించుకోదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతిపై హరిరామజోగయ్య మాటలు నిజమేనని, అయితే బహిరంగంగా మాట్లాడాల్సింది కాదని ఆయన అన్నారు. అవినీతి గురించి తాము చాలా రోజులుగా చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సీనియర్ల మాటకు విలువ ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications