యువీకి టాటా: మరొకరితో దీపిక
ముంబయి: బాలీవుడ్ నటి దీపికా పడుకొనే ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. భారత క్రికెట్ వన్డే స్పెషలిస్టు యువరాజ్ సింగ్ తో ఆమె ప్రేమ కథ ఇక ముగిసినట్లేనని సమాచారం. ఆమె యువరాజ్ కు గుడ్ బై చెప్పేసి మరొకరితో ప్రేమలో పడిందట. యువీ తనపై ఆధిపత్యం చెలాయించడమే ఆమెకు నచ్చలేదని తెలుస్తోంది. ఎటువంటి దుస్తులు ధరించాలో, ఏ సినిమాల్లో నటించాలో, ఏ పార్టీలకు వెళ్లాలో యువరాజ్ చెప్పేవాడట. అది నచ్చక దీపికా పడుకొనె యువీకి సలామ్ కొట్టేసి బయటపడిందట. భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో మొదట ప్రేమలో పడిన ఆమె రోజులు కూడా గడవక ముందే యువీ వలలో పడింది.
ఇప్పుడు ఆమె జీవితంలో కొత్త ప్రేమికుడు ప్రవేశించాడని ప్రచారం జరుగుతోంది. సావరియా హీరో రణబీర్ కపూర్ తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఖండించినప్పటికీ నిజం ఇటీవలి ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో బయటపడిందట. తమ అవార్డులను అందుకోవడానికి చివరి వరుసలో నిలబడిన వీరిద్దరి గుసగుసలు అందరి చెవుల్లో పడ్డాయని అంటున్నారు. రణబీర్ కపూర్ ఐ లవ్ యూ అని దీపికా పడుకొనే చెవులో ఊదాడట. వెంటనే దీపికా పడుకొనే అవే మాటలను రణబీర్ తో చెప్పిందట. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన పార్టీలో ఇద్దరు కలిసి ఉండటం అందరి కంటా పడిందట.












Click it and Unblock the Notifications