ఆశాషైనీ వీసా: వెంకటేశ్వరరావు సూత్రధారి
హైదరాబాద్: సినీ నటి ఆశాషైనీకి నకిలీ వీసా ఇప్పించింది హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వరరావు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 200 మంది దక్షిణాది సినీ ప్రముఖులు నకిలీ వీసా కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు చెన్నై అమెరికన్ కాన్సులేట్ నిర్ధారించింది. వారిపై జీవిత కాలం నిషేధం విధించింది. వారి పేర్లను వెల్లడించడానికి అమెరికన్ కాన్సులేట్ నిరాకరించింది. తప్పుడు ధ్రువపత్రాలతో వీసాలు పొంది అమెరికాకు మనుషులను పంపిన కుంభకోణంలో తమిళ, తెలుగు, కన్నడ, మళయాలీ సినీ ప్రముఖులున్నారు. వీరిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు 60 మంది, తమిళ సినీ పరిశ్రమకు చెందినవారు 70 మంది ఉన్నట్లు సమాచారం.
ఆశాషైనీకి నకిలీ ధ్రువపత్రాలతో వీసాను ఇప్పించండంలో ప్రధాన పాత్ర పోషించిన హైదరాబాదుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో ఒక్కసారి పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే అతను తప్పించుకున్నాడు. ఈ వీసాల కుంభకోణంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ పట్టు పడితే కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆశాషైనీతో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications