రాహుల్ భద్రతా ఉల్లంఘన

స్థానిక అధికార యంత్రాంగానికి చెప్పకుండా తన ప్రత్యేక భద్రతా సిబ్బంది (ఎస్పీజీ)తో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు మాయమయ్యాడు. ఆయన 25 కిలోమీటర్ల దూరంలోని నక్సల్స్ ప్రభావితం ప్రాంతంలో గల ఒక గ్రామానికి వెళ్లారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి ఆయన వెళ్లినట్లు సమాచారం. రాహుల్ కారును అనుసరించడానికి కోరాపూట్ ఎస్పీ అనుసరించడానికి ప్రయత్నించారు. అయితే రాహుల్ ఎస్పీజీ ఆ అధికారిని వెంట రానీయలేదు. నాలుగు గంటల తర్వాత రాహుల్ అతిథి గృహానికి తిరిగి వచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోకి అలా వెళ్లడం భద్రతా నియమాలను ఉల్లంఘించడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేసిన ఈ పర్యటన గురించి జిల్లా పోలీసులకు ఏ మాత్రం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళన రేకెత్తింది. రాహుల్ గ్రామంలో ఉన్నప్పుడు ఎస్పీజీ ఎస్పీతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని అధికార వర్గాలు ఫిర్యాదు చేశాయి. స్థానిక ప్రజలు సంప్రదాయ ఆయుధాలతో ఎస్పీజీతో వివాదానికి దిగారు. ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం శాఖ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నవీన్ పట్నాయక్ కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకొని వెళ్లారు.












Click it and Unblock the Notifications