20 హత్యల సీరియల్ కిల్లర్ అరెస్టు
సిద్ధిపేట: సీరియల్ కిల్లర్ యాదగిరిని పోలీసులు మెదక్ జిల్లా సిద్ధిపేటలో అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు గురువారం మీడియా ప్రతినిధుల ముందు హాజరు పరిచారు. అతను 2000 సంవత్సరం నుంచి 20హత్యలు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇతనిది మెదక్ జిల్లా దొంతి గ్రామం. ఇతను మోటార్ సైకిల్ వెళ్తుండగా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన హత్య కేసులో బెయిల్ పై విడుదలై బయట తిరుగుతున్నాడు. కరీంనగర్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాల్లో యాదగిరి హత్యలకు, దొంగతనాలకు పాల్పపడినట్లు పోలీసులు చెప్పారు.
యాదగిరి హత్య చేసినవారిలో 9 మంది మహిళలు ఉన్నారు. తన మెడపై వేసుకునే టవల్ తో గొంతు నులిమి చంపడం యాదగిరి ప్రత్యేకత. హత్య చేసిన తర్వాత నగలను తీసుకోవడం అతనికి అలవాటు. ఆ నగలను అమ్మి పెట్టడంలో యాదగిరి భార్య ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్లు తాగిన తర్వాతనే తాను హత్యలు చేస్తుంటానని, మామూలు స్థితిలో హత్యలు చేయనని యాదగిరి చెబుతున్నాడు. తన పిల్లలను ప్రభుత్వం చదివిస్తే హత్యలు మానేస్తానని అతను చెబుతున్నాడు. ఇలా చెప్పడం ప్రతిసారీ అతనికి అలవాటే.












Click it and Unblock the Notifications