టిడిపి, పత్రికలపై వైయస్ విసుర్లు

తమపై వచ్చిన ఆరోపణలన్నింటిపై తాము విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్న పరిశ్రమలను మూసేశారని, కొన్ని పరిశ్రమలను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. ఓబులాపురం మైనింగుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002లో అనుమతి ఇచ్చారని, తాము 2004, 2005ల్లో ఇచ్చామని, తెలుగుదేశం ఇస్తే సరైంది, తామిస్తే తప్పా అని ఆయన అన్నారు. పరిశ్రమ పెట్టడానికి ముందుకు రావడంతో ఓబులాపురం మైనింగుకు అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పరిశ్రమ కోసం అనుమతి ఇచ్చిందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications