కెవిపి తీరని ద్రోహం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు మంత్రి పదవి విషయంలో తనకు తీరని ద్రోహం చేశారని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గమే అడ్డు అని, ముఖ్యమంత్రి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బలవంతురాలు కారని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని, గౌరవం ఉండి ఉంటే తనకు గవర్నర్ పదవి దక్కి ఉండేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజీమానాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయకపోవడమే న్యాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications