దేవాదుల వద్ద సోనియా భోజన విరామం
వరంగల్: యుపిఎ చైర్ పర్సన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వరంగల్ జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం వద్దనే భోజన విరామం తీసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆమె వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు వద్దకు వచ్చారు.
దేవాదుల ప్రాజెక్టు శిలా స్థూపాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల మోటార్ల పనితీరును ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోనియా పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో అనుమతి లభించని స్థానిక కాంగ్రెసు నాయకురాలు రమాదేవి కంట తడి పెట్టారు. దేవాదుల సందర్శన అనంతరం ఆమె హైదరాబాదుకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications