గోదావరిలో డూప్ గల్లంతు: అనుష్క పనే?
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీరంలో జరుగుతున్న సినిమా షూటింగులో అపశృతి చోటు చేసుకుంది. హీరో రవితేజ డూప్ మహేంద్ర గోదావరి నదిలో గల్లంతయ్యాడు. హీరోయిన్ అనుష్క తోసేయడం వల్లనే మహేంద్ర నదిలో కొట్టుకుపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే శనివారం సాయంత్రం డూప్ మహేంద్ర గోదావరి నదిలో గల్లంతయ్యాడు. దీంతో సినిమా షూటింగ్ ఆపేశారు. సినిమా యూనిట్ పరారైనట్లు తెలుస్తోంది. మహేంద్ర కోసం గాలిస్తున్నారు. మహేంద్ర రాజమండ్రికి చెందినవాడని తెలుస్తోంది.
సినిమాలో గోదావరి నదిలో డైవ్ చేసే దృశ్యం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మహంద్ర మొదటి సారి ప్రయత్నించాడు. రెండో సారి కూడా ప్రయత్నించిన సమయంలో గల్లంతయ్యాడు. అయితే అనుష్క మహేంద్రను ఒకటికి రెండు సార్లు ఈత వచ్చా, డైవ్ చేసి తిరిగి రాగలరా అని అడిగిందట. ఇందులో అనుష్క తప్పేమీ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ దర్శకుడు ఉదయశంకర్ కు అక్కడ గోదావరి లోతుపై తగిన అంచనా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే వాదన కూడా వినిపిస్తోంది. అనుష్క, ఉదయశంకర్ లపై కేసు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications