గోతిలో పడ్డ బాలుడు క్షేమం
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కురగల్లు గ్రామంలో గొతిలో పడిన మూడేళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. అధికారులు తీవ్ర ప్రయత్నం చేసి బాలయ్య అనే ఆ బాలుడిని వెలికి తీశారు. అనంతరం ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆడుకుంటూ ఆ బాలుడు జారి పది అడుగుల లోతు గల గోతిలో పడ్డాడు. ఇంటి నిర్మాణం కోసం ఈ గోతిని తవ్వారు.
బాలుడిని వెలికి తీయడానికి చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. వెంటనే వివిధ రంగాల అధికారులు, వైద్యులు రంగంలోకి దిగారు. బాలుడికి ఆక్సిజన్ పంపారు. పక్కన అటువంటిదే మరో గోతి తవ్వి బాలుడిని అతి కష్టం మీద వెలికి తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications