ఎంపిటిసిలకు చంద్రబాబు హామీ

హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఎంపిటిసిల ఫైలుపైనే సంతకం పెడ్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తమకు అధికారం ఇస్తే స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయిస్తామని ఆయన చెప్పారు. తమకు నిధులు, విధులు బదలాయించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాదేశిక కమిటీ సభ్యులు (ఎంపిటిసిలు) సోమవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నా శిబిరంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఏలూరులో ఎంపిటిసిలపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ధర్నా శిబిరంలో పలువురు నాయకులు ప్రసంగించారు. అనంతరం ఎంపిటిసిలు శాసనసభను ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురు ఎంపిటిసిలను పోలీసులను అరెస్టు చేశారు. దీంతో ఎంపిటిసిల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+