శివానీ హత్య కేసు: ఆర్కే శర్మకు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్య కేసులో సస్పెండ్ అయిన ఇన్సెపెక్టర్ జనరల్ రవికాంత్ శర్మకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శివానీ హత్యకు కుట్ర చేసినందుకు రవికాంత్ శర్మను అదనపు సెషన్స్ జడ్జి రాజేంద్ర కుమార్ శాస్త్రి ఈ నెల 18వ తేదీన దోషిగా నిర్ధారించారు.
మరో ముగ్గురు సహ నిందితులు భగ్వాన్ శర్మ, ప్రదీప్ శర్మ, సత్యప్రకాశ్ లను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి కూడా కోర్టు జీవితఖైదు విధించింది. ఈ నలుగురికి జీవిత ఖైదుతో పాటు 20 వేల రూపాయలేసి జరిమానా కూడా విధించింది. వేద్ ప్రకాష్ శర్మ, వేద్ ప్రకాశ్ అలియాస్ కాలులను సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications