సమైక్యవాదులకు కౌన్సిల్ నుంచి ఉద్వాసన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనుకూల వైఖరిని వ్యతిరేకిస్తూ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నఇద్దరు నాయకులను సిపిఐ జాతీయ కౌన్సిల్ నుంచి తప్పించారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న లక్ష్మీనారాయణ, రామారావులను జాతీయ కౌన్సిల్ నుంచి తప్పిస్తూ పార్టీ జాతీయ మహాసభల్లో నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణపై సిపిఐ రేపు తన వైఖరిని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు.
జాతీయ కౌన్సిల్ లో రాష్ట్రానికి చెందిన నలుగురికి స్థానం కల్పించినట్లు సమాచారం. ముప్పాళ్ల నాదేశ్వరరావు, పల్లా వెంకటరెడ్డి, జి. మల్లేష్, సత్యనారాయణమూర్తులకు జాతీయ కౌన్సిల్ లో స్థానం కల్పించారు. ఈ విషయమై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది.












Click it and Unblock the Notifications