శ్రీనివాస్ నియామకంపై తలో మాట
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ నియామకంపై తలో రకంగా స్పందించారు. పిసిసి అధ్యక్షుడిగా శ్రీనివాస్ నియామకం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, అప్పటి పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు కలిసి తిరిగి పార్టీని గెలిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ సమన్వయ లోపం లేకుండా పని చేస్తారని, ఇరువురి మధ్య ఏ విధమైన ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు అన్నీ తెలుసునని, అందర్నీ కలుపుకొని పోతారని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ అనుభవజ్ఞుడని, అది పార్టీకి పనికి వస్తుందని, దూరమవుతున్నవారిని కూడా కలుపుకుని పోతారని ఆయన అన్నారు. శ్రీనివాస్ నియామకం పనికి వస్తుందేమో చూద్దామని ఆయన అన్నారు. శ్రీనివాస్ తెలంగాణవాది, తాను ఆంధ్రావాదిని అని, ఇద్దరం కాంగ్రెస్ వాదులమని గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications