మావోయిస్టు అగ్రనేత సారయ్య హతం
వరంగల్: వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతన్ పల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటరులో మావోయిస్టు అగ్ర నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, ఆయన భార్య పద్మ మరణించారు. సారయ్య స్వగ్రామం వరంగల్లు జిల్లా చిట్యాల మండలం వెలిశాల. గత 25 ఏళ్లుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో ఉన్నాడు. ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ కు అతను సోదరుడు.
సారయ్య, ఆయన భార్య పద్మ గతంలో పలు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారు. సారయ్య వరంల్లు జిల్లాకు వచ్చే అవకాశం లేదని, సారయ్యది బూటకం ఎన్ కౌంటరు అని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు అన్నారు. సారయ్య ఎన్ కౌంటరుతో మావోయిస్టులకు రాష్ట్రంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. 2002లో జరిగిన మానాల - వట్టిమల్ల అడవుల్లో 16 మంది గిరిజనుల ఊచకోత కేసులో సారయ్య నిందితుడు.












Click it and Unblock the Notifications