అసెంబ్లీలో తీర్మానానికి స్పీకర్ 'నో'

తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని, అటువంటి ప్రభుత్వానికి లేఖ రాసే అర్హత లేదని, అందువల్ల శాసనసభలో తీర్మానం చేసి హైకోర్టుకు పంపాలని కోరుకుంటున్నామని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వం లేఖ రాస్తే తాము అందులో భాగస్వాములం కాదలుచుకోలేదని ఆయన చెప్పారు. శాసనసభలో తీర్మానం చేయకపోవడాన్ని సిపిఐ, సిపియం కూడా తప్పు పట్టాయి. శాసనసభలో తీర్మానం చేయాలని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications