గట్టి భద్రత మధ్య ఒలింపిక్ జ్యోతి ర్యాలీ
న్యూఢిల్లీ: బీజింగ్ ఒలింపిక్ జ్యోతి ర్యాలీ గురువారం సాయంత్రం జరిగింది. ఈ ర్యాలీ చారిత్రాత్మకమైన రాజపథ్ నుంచి ఇండియా గేట్ వరకు జరిగింది. భారీ భద్రత మధ్య ఈ ర్యాలీ జరిగింది. టిబెటెన్ల ఆందోళనల నేపథ్యంలో ర్యాలీకి ఎక్కడి లేని భద్రత ఏర్పాటు చేశారు. మాజీ కుస్తీ క్రీడాకారుడు సత్పాల్ తొలుత ఈ జ్యోతితో పరుగులో పాల్గొన్నారు. భారత ఒలింపిక్ సంఘం చీఫ్ సురేష్ కల్మాడి జ్యోతిని వెలిగించారు.
వివిధ రంగాలకు చెందిన 70 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 2.3 కిలోమీటర్ల సాగిన ఈ పరుగులో జ్యోతిని త్వరత్వరగా ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మార్చుకున్నారు. జ్యోతి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. 30 మంది టిబెటన్లు రాష్ట్రపతి భవనులోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా సిబ్బంది చెదరగొట్టారు. ఢిల్లీలో దీనికి సమాంతరంగా ర్యాలీ జరిగింది. జార్జీ ఫెర్నాండెజ్, మేధా పాట్కర్ పాల్గొన్న ఈ ర్యాలీని పోలీసులు జంతర్ మంతర్ వద్ద అడ్డుకుని జ్యోతిని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications