వదిన గొంతు కోసి చంపిన మరిది
నిజామాబాద్: వదినను మరిది గొంతు కోసి హత్య చేసిన సంఘటన నిజామాబాదులో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మహేష్ కుమార్ యాదవ్ అనే యువకుడు తన వదిన యాదమ్మను హత్య చేశాడు.
మహేష్ కుమార్ గురువారం ఉదయం వదినను తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. తర్వాత తలుపులు పెట్టాడు. ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత కడుపులో కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications