ధరలపై మంత్రుల నివేదికలకు ఆదేశం

రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెరాస ప్రాతినిధ్యం వహించిన శాసనసభా నియోజకవర్గాలు అభివృద్ధిలో వెనకబడిన విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కడప పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. క్రీడానిధి ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధరలను ఒకటి, రెండు రోజుల్లో తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications