అందరికీ ఫలితాలు అందాలి: బాబు
హైదరాబాద్: ఆర్థిక సంస్కరణల వల్ల పెరిగిన సంపద సామాన్యులకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మీ కోసం పేర తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనకోసం ఆయన ఆదివారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీ రామారావుకు శ్రద్ధాంజలి ఘటించి ఆయన తిరుపతి బయలు దేరి వెళ్లారు. దానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆర్థిక సంస్కరణల వల్ల సంపద ఒనగూరిందని, ఇందులో తమ పాత్ర కూడా ఉందని, అయితే ఆ సంపద కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుతోందని, ఈ సంపద పేదలకు, సామాన్యులకు అందాల్సి ఉందని ఆయన అన్నారు. తాము ఎన్టీరామారావు స్ఫూర్తితో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్టీ రామారావు పేదరిక నిర్మూలనకు, సమ సమాజ స్థాపనకు కృషి చేశారని, ఎన్టీరామారావు ఆశయసిద్ధికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఆయనకు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications