అభ్యర్థులపై వైయస్ తో డిఎస్ చర్చలు
హైదరాబాద్: ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆదివారం నాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో చర్చించారు. వీరిరువురు సమావేశమై అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై శ్రీనివాస్ గత రెండు రోజులుగా చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏకాభిప్రాయం కుదిరిన చోట్ల ఒక అభ్యర్థితో, కుదరని చోట ఇద్దరు, ముగ్గురి పేర్లతో ఆయన ఒక జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది.
తాను తయారు చేసిన జాబితాపై శ్రీనివాస్ ఆదివారంనాడు ముఖ్యమంత్రితో చర్చించారు. ఆ జాబితాను పార్టీ అధిష్ఠానవర్గం ముందు పెట్టి ఆమోదముద్ర వేయించుకోవడానికి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్తారు. తెర్లాం, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయ సాధన విషయమై కూడా శ్రీనివాస్ అధిష్ఠానవర్గంతో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 18 శాసనసభా నియోజకవర్గాలకు, నాలుగు లోకసభ స్థానాలకు వచ్చే నెల 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications