చిరు అన్యాయం చేయరు: నాగబాబు
తిరుపతి: అన్నయ్య న్యాయం చేస్తారని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు అభిమానులకు చెప్పారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా విజయోత్సవ సభలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతుండగా చిరంజీవి అభిమానులు సందడి చేశారు. రాజకీయ ప్రవేశానికి సంబంధించిన నినాదాలు చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ చిరంజీవి అన్యాయం చేయరని చెప్పారు.
చిరంజీవి అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయరని నాగబాబు చెప్పారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. చప్పట్లు కొట్టారు. ఆనందోత్సాహాల మధ్య హర్షాతిరేకాలు చేశారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావన లేకుండా ప్రసంగించాలనుకున్న నాగబాబు ప్రయత్నం అభిమానుల ఒత్తిడితో మాట్లాడక తప్పలేదు.












Click it and Unblock the Notifications