ధరలను అదుపు చేస్తాం: రోశయ్య
హైదరాబాద్: వారం రోజుల్లో ధరలను అదుపు చేస్తామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. కంపెనీల అత్యాశ వల్లనే సిమెంటు ధరలు పెరిగాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 22వ తేదీన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నివేదిక సమర్పించి చర్చలు జరుపుతుందని ఆయన చెప్పారు.
ఇందిరమ్మ గృహాలకు ఇవ్వాల్సిన కోటాను కూడా సిమెంటు కంపెనీలు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. సిమెంటు కంపెనీలు నిబంధనలను పాటించడం లేదని ఆయన విమర్శించారు. అక్రమ నిల్వలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications