ఇంటర్ ఫస్టియర్: బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. బాలికలు 57 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,38,127 మంది అభ్యర్థులు హాజరు కాగా 3, 91,375 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 53.5 శాతం. నిరుటి కన్నా 3 శాతం మంది ఈ ఏడాది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా, రంగారెడ్డి జిల్లాలు ప్రథమ స్థానంలో నిలువగా 33 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను విద్యా మంత్రి చెంగారెడ్డి బుధవారంనాడు విడుదల చేశారు.
శ్రీకాకుళంలో 50 శాతం మంది, విజయనగరం జిల్లాలో 45 శాతం మంది, విశాఖపట్న జిల్లాలో 61 శాతం మంది, తూర్పు గోదావరి జిల్లాలో 53 శాతం మంది, ప్రకాశం జిల్లాలో 51 శాతం మంది, నెల్లూరు జిల్లాలో 56 శాతం మంది, కడప జిల్లాలో 46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో 38 శాతం మంది, నిజామాబాద్ జిల్లాలో 57 శాతం మంది, కరీంనగర్ జిల్లాలో 50 శాతం మంది, వరంగల్ జిల్లాలో 45 శాతం మంది, నల్లగొండ జిల్లాలో 47 శాతం మంది, హైదరాబాద్ జిల్లాలో 58 శాతం మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 52 శాతం మంది, చిత్తూరు జిల్లాలో 53 శాతం మంది, మెదక్ జిల్లాలో 43 శాతం మంది, గుంటూరు జిల్లాలో 57 శాతం మంది, ఖమ్మం జిల్లాలో 46 శాతం మంది, కర్నూలు జిల్లాలో 48 శాతం మంది, అనంతపురం జిల్లాలో 45 శాతం మంది, నిజామాబాద్ జిల్లా 57 శాతంమంది పాసయ్యారు.












Click it and Unblock the Notifications