కెసిఆర్ పై వైయస్ విసుర్లు

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. గాంధీభవన్ లో శుక్రవారం ఏర్పాటైన కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం (ఎన్.ఎస్.యు.ఐ) కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కెసిఆర్ తెలంగాణవాదాన్ని తెర మీదికి తెచ్చారని ఆయన విమర్శించారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు 1999లో మంత్రి పదవి వచ్చి ఉంటే కెసిఆర్ తెరాసను పెట్టి ఉండేవారు కారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కెసిఆర్ ఈ రోజు ఎన్నికలను ఆహ్వానించారని, ఈ ఉప ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కావని ఆయన అన్నారు.

చిన్న అంశం కోసం కెసిఆర్ ఉప ఎన్నికలు వచ్చేలా చేశారని, తాను తెలంగాణ సెంటిమెంటు లేదని అనలేదని, తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కు తమదేనని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మాట్లాడిందని తొలుత తమ పార్టీ శాసనసభ్యులేనని ఆయన చెప్పారు. తెలంగాణవాదాన్ని రుజువు చేయడానికి ఎన్నికలను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికలను కెసిఆర్ ఆపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఎన్నికలు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+