ముస్లిం కోటా ఈ ఏడాదీ ఉత్తదే
హైదరాబాద్: ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై స్టే కొనసాగుతుందని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ముస్లింలకు ఇ-కెటగిరీ అడ్మిషన్లకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
ముస్లిం రిజర్వేషన్ల అమలుపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేను రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. ముస్లిం రిజర్వేషన్లపై రిట్ పిటిషన్స్ డిస్మిస్ అయ్యే వరకు స్టే కొనసాగుతుందని న్యాయవాదులు అంటున్నారు.












Click it and Unblock the Notifications