ఎన్నికల ప్రచారానికి బాబు శ్రీకారం

Chandrababu Naidu
వరంగల్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం డోర్నకల్ లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచార ప్రసంగం చేశారు. అధిక ధరలు, స్థానిక సమస్యలు ప్రధానం చేసుకుని ఆయన ప్రసంగం సాగింది. తెలంగాణపై తాము కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మాదిరిగా మోసం చేయబోదని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెరాస అనవసరంగా ఉప ఎన్నికలను తెచ్చిందని, ఆ పార్టీ ప్రజాసమస్యలపై ఎప్పుడు కూడా ఆలోచించలేదని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను రేషన్ కార్డులపై కాకుండా బెల్టు షాపులపై పెడితే బాగుంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తాము అధికారంలోకి వస్తే 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గొర్రెల కాపరులకు పది పైసల వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు. మైదాన ప్రాంతంలోని గిరిజనుల కోసం ఐటిడిఎ లాగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. సన్న, చిన్నకారు రైతుల రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+