అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో కంత్రీ సినిమా టికెట్ల కోసం తీవ్రంగా తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. తాడిపత్రిలోని లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రీ సినిమా భారీ అంచనాలతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. తాడిపత్రి లక్ష్మినారాయణ థియేటర్ వద్ద టికెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.
తొక్కిసలాటలో ఊపిరాడక ప్రసాద్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మరణించాడు. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అదుపు చేయడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.