చలిజ్వరంలోనూ బాబు ప్రచారం
హైదరాబాద్: తెలుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చలి జ్వరంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం ముషిరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన రాత్రి ఇంటికి వెళ్లకుండా అడ్డగుట్టలో బస చేశారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఆయన వద్దకు వెళ్లారు. డాక్టర్ సోమరాజు ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. బాలృష్ణ, హరికృష్ణ, తెలుగుదేశం నాయకులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే ధరలు పెరిగాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో రౌడీయిజం సాగుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. భూఆక్రమణదారులు శృతి మించిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ఆయన అన్నారు. ఉగ్రవాద చర్యలు కూడా పెరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications