తెలంగాణపై ఓపెన్ మైండ్: బాబు
హైదరాబాద్: తెలంగాణపై తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని, తాము విశాల దృక్పథం ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి అదికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నరమేథం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పులివెందుల సంస్కృతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రస్తుతం పెట్టిన కేసులను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, తెరాస ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టడమే తమ ఉద్యేశ్యమని ఆయన అన్నారు. తెలంగాణలో తమకు అనూహ్య ఫలితాలు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ జయంతిని ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సినీ నటులు, తన బంధవులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హాజరవుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications