వైయస్ టైమ్ పై ఇసి ఆగ్రహం
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఎన్నికల ప్రచారం కోసం గంట సమయం అధికంగా ఇవ్వడంపై ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిచ్ పల్లి శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనను పట్టించుకోని నిజామాబాద్ ఆర్డీవో, డిఎస్పీలను బదిలీ చేయాలని కమీషన్ ఆదేశించింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన విషయంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కేసును మూసివేయడాన్ని కమీషన్ తప్పు పట్టింది. ఈ కేసును వెంటనే తెరవాలని ఆదేశించింది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఈ కేసు నమోదయింది. కొత్తగా లక్షలాది పింఛన్లు ఇవ్వనున్నట్లు వచ్చిన వార్తపై ఎన్నికల కమీషన్ సూమోటో నివేదికకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications