చిన్నారెడ్డి, స్వర్ణలకు ఇసి నోటీసులు
న్యూఢిల్లీ: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జి. చిన్నారెడ్డికి, కాంగ్రెస్ శాసనసభ్యురాలు స్వర్ణా సుధాకర్ కు ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై కమీషన్ ఆ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోగా తమ నోటీసులపై వివరణ ఇవ్వాలని కమీషన్ వారిని ఆదేశించింది.
జడ్చర్ల శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా ప్రచార నిమిత్తం ప్రభుత్వ పాఠశాలలో సభ ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ పార్టీ జెండాలు ప్రదర్శించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమీషనుకు చిన్నారెడ్డి, స్వర్ణాసుధాకర్ లపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వార్తాకథనాలను, సిడీలను తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమీషనుకు సమర్పించింది. దీంతో వారికి ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications