అధికారులపైనా చర్యలు: ఐవి
హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు చెప్పారు. రాజకీయ నాయకులపైనే కాకుండా కోడ్ ఉల్లంఘిస్తే అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నికలపై చర్చించడానికి రేపు (మంగళవారు) రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాము ఉప ఎన్నికల్లో 680 సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్లను గుర్తించామని, వీటిలో సూక్ష్మస్థాయి ఎన్నికల పరిశీలకులను నియమిస్తామని, ఇది కొత్త పద్ధతి అని, ప్రతి సూక్ష్మస్థాయి పరిశీలకుడు తనకు అప్పగించిన పోలీంగ్ స్టేషనులో ఒటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్యయ్యే వరకు ఉంటాడని ఆయన చెప్పారు. మరో 50 మంది పరిశీలకులు తిరుగుతూ ఉంటారని, వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications