ఉప ఎన్నికల రెఫరెండమే: జానారెడ్డి
వరంగల్: ఉప ఎన్నికలు రెఫరెండమేనని రాష్ట్ర హోంమంత్రి కె. జానారెడ్డి అన్నారు. వరంగల్లు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభ సోమవారం ప్రసంగిస్తూ ఆయన ఆ అభిప్రాయం వక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు బేరీజు వేస్తారని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో హోంమంత్రి విభేదిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారా, లేదా అనే విషయం ఈ ఎన్నికల ద్వారా వెల్లడవుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గతంలో మోసం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications