లద్దగిరిలో బాంబు పేలుళ్లు
కర్నూలు: కర్నూలు జిల్లా లద్దగిరి గ్రామంలో గడ్డివాములో దాచిన బాంబులు పేలినట్లు సమాచారం. ఈ గ్రామం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర రెడ్డిది. ఎండ వేడికి ఈ బాంబులు పేలినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నమే జరిగినట్లు సమాచారం. అయితే అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడ్డి వాము మొత్తం కాలిపోయింది. దాదాపు 30 బాంబులు పేలినట్లు సమాచారం.
తెలుగుదేశం నాయకుడు కపట్రాళ్ల వెంకటప్పనాయుడును హత్య చేయగా మిగిలిన బాంబులను గడ్డివాములో దాచినట్లు భావిస్తున్నారు. పేలిన బాంబులు అవేనని అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే డిఎస్పీ రామనాథం తన బలగాలతో లద్దగిరికి చేరుకున్నారు. అయితే బాంబులు పేలినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రామనాథం అంటున్నారు.












Click it and Unblock the Notifications