తేనెటీగల దాడి: గాయపడిన విద్యార్థిని

Tirupathi
తిరుపతి: తిరుపతి పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై శుక్రవారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పూజిత అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆ అమ్మాయిని అస్పత్రిలో చేర్చారు. ఆ అమ్మాయికి తదుపరి పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించారు. ఆమెకు శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష నిర్వహిస్తారు.

పద్మావతి జూనియర్ కళాశాలలో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. తేనెటీగల దాడితో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+