బాలకృష్ణ "#NBK111"లో మంచు మనోజ్..

మంచు మనోజ్.. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. కానీ మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. విభిన్న పాత్రలతో తన నటనా టాలెంట్ నిరూపించుకున్నాడు. సహజమైన నటనతో పాటు ప్రయోగాత్మక సినిమాల పట్ల కూడా ఆసక్తి చూపి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగానే కెరీర్ ప్రారంభించిన మనోజ్.. దొంగోడు సినిమాతో హీరోగా మారారు.

కాగా మనోజ్ కెరీర్‌లో ముఖ్యమైన మలుపు తీసుకొచ్చిన చిత్రం 'బిందాస్'. ఆ సినిమా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా, యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించింది. ఆ తర్వాత 'వేదం', 'ప్రయాణం', 'ఝుమ్మంది నాదం', నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ.. వంటి సినిమాలు తన కంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. ముఖ్యంగా 'వేదం' సినిమాలో కూడా ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది.

manchu-manoj-going-to-play-crucial-role-in-nandamuri-balakrishna-and-gopichand-malineni-movie-nbk111

అయితే ఆ ఆశించిన స్థాయిలో సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం.. పలు పర్సనల్ కారణాల వాళ్ల దశాబ్ద కాలం పాటు మూవీస్ కి బ్రేక్ ఇచ్చారు. కాగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. రీఎంట్రీలో 'భైరవం', 'మిరాయ్' చిత్రాలలో విలన్‌గా నటించి విజయాలు సాధించడంతో తిరిగి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు హీరోగా 'డేవిడ్ రెడ్డి' అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

కాగా నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "అఖండ 2" చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయగా.. రీసెంట్ గానే పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానుండగా.. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. 'మీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రేక్షకులు చూడడం కోసం వేచి చూస్తున్నా' అని రాశారు. ఇందులో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో బాలకృష్ణ, మంచు మనోజ్‌ ఇద్దరూ 'ఊ..కొడతారా ఉలిక్కిపడతారా' సినిమాలో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+